తెలుగు సామెతలు Telugu Proverbs Telugu Saamethalu 17

వడ్డించే వాడు మనవాడైతే, యే పంక్తిలో ఉంటే ఏమి?
వడ్ల గింజలో బియ్యపు గింజ.
వెన్నతో పెట్టిన విద్య.
వెర్రి వెయ్యి విదాలు.
వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు.
వినాశ కాలే విపరీత బుద్ది.
వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పేవాడు వేదాంతిట.
వినే వాడుంటె, అరవంలో హరికథ చెప్పాడట నీలంటివాడు.
విశ్వేశ్వరుడికి లేక విభూది నాకుతుంటే, నందీశ్వరుడు వచ్చి నాకేది అని అడిగాడట.
రాజుగారి దివానములో చాకలోడి పెత్తనము.
రాజు పెళ్లానికి ముష్టి రాత ఎవడు తప్పించగలడు?
రామాయణంలో పిడకల వేట.
రాత రాళ్ళ పాలైతే, మొగుడు ముండ పాలు అయ్యాడట.
రాజు గారి రెండవ భార్య మంచిది అన్నట్టు.
రాజు గారు తలచు కొంటె దెబ్బలకు కొదువా.
రాజును చూసిన కన్నులతో మొగుడ్ని చూస్తే చులకనలే.
రామాయణం అంతా విని సీత రాముడుకి ఎమౌతుంది అని అడిగాడంట.
రంకు మొగుడు, బొంకు పెళ్లాం.
రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అన్నట్లు.
రవి కాంచని చొటు కవి గాంచునట.
రెండు పడవల మీద ప్రయాణం
రోలు వచ్చి మద్దెలతొ మొర పెట్టుకుందిట.
రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు.
రౌతు కొద్దీ గుర్రము.
రుణ శేషం, శత్రు శేషం ఉంచరాదు.
ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది.
ఉపకారానికి పోతె అపకారమెదురైనట్లు.
ఉరుము ఉరుమి మంగలం మీద పడ్డట్లు.
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతానందట
తడి గుడ్డతొ గొంతు కోసినట్లు.
తాదూర కంత లేదు కానీ మెడకో డోలు.
తా చెడ్డ కోతి వనమెల్ల చెరచిందట.
తాడి తన్నువాని తల తన్ను వారు ఉండును.
తాలిబొట్టు బలమువల్ల తలంబ్రాల వరకు బతికాడు.
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23

తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *