![]() |
Dr. Pagadala Nagender |
డాక్టర్ పగడాల నాగేందర్ గారు కవిగా, కథకునిగా, విమర్శకునిగా తెలుగు నేలకి సుపరిచితుడు. రెండు దశాబ్ధాలుగా ఆధునిక సాహిత్యంలో అనేకానేక అంశాలపై రచనలు చేస్తున్నారు. నిఖార్సయిన విమర్శకునిగా తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రసిద్ధి చెందారు. తెలుగు సాహిత్యం పై, వివిధ ఆస్తిత్వ ఉధ్యమాలపై వీరు రాసిన వ్యాసాలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘చిక్కనవుతున్న పాట’, ‘బహువచనం’, ‘పొక్కిలి’, ‘మత్తడి’, లాంటి ప్రతిష్టాత్మక కవితా సంకలనాల్లో వీరి కవితలు చోటు చేసుకున్నాయి.
చదువుకునే రోజుల్లోనే కవిత్వం రాసిన నాగేందర్ గారు నల్లగొండలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, లక్ష్మయ్యలు. నాగేందర్ గారు నల్లగొండలోని డి.వి.ఎం. హైస్కూల్, గీతా విజ్ఞాన హైస్కూల్ లో విద్యనభ్యసించారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోని చైతన్య కళాశాలలోను, బి.ఎ. (లాంగ్వేజెస్) నల్లగొండలోని గీతా విజ్ఞానాంధ్ర్ర కళాశాలలో, ఎం.ఎ.(తెలుగు) ఉస్మానియా విశ్వవిధ్యాలయంలోనూ చదివారు. ‘జంగం కథ – ఒక పరిశీలన’ అనే అంశంపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్. పట్టా పొందారు. ‘సమకాలీన తెలుగు వచన కవిత్వం – ప్రాంతీయ దృక్పథాలు’ అనే అంశంపై పరిశోధన చేసి, ఉస్మానియా విశ్వవిధ్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని నిజాం కళాశాల, తెలుగు శాఖలో స్నాతకోత్తర విద్యార్ధులకు విద్యాబోధన చేస్తున్నారు.
1990 దశకం మధ్యలో ‘నీలగిరి సాహితి’ సంస్థ, నల్లగొండ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1998-2002ల మధ్య ‘తెలంగాణ సాంస్కృతిక వేదిక’ లో చురుకైన పాత్ర పోషించారు. ‘పదునెక్కిన పాట’ మొదలైన కవితా సంకలనాలకు ఉప సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రపంచ సినిమాలపై వీరు రాసిన వ్యాసాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. రెండు దశాబ్దాలుగా ఆధునిక సాహిత్యంలోని వివిధ అంశాలపై వీరు రాసిన యాభైకి పైగా వ్యాసాలు ఈ ‘మొగురం’ పుస్తకరూపంలో మీ ముందుకు వస్తున్నాయి.
Dr. Pagadala Nagender,
M.A., M.Phil., Ph.D.
Lecturer
Dept. of Telugu, Nizam College,
Hyderabad.
Telangaana.
Email : nagenderpagadala@gmail.com
Cell :9849872230