టిఆరెస్స్ నేత మాజీ నక్సలైట్ కొనాపురి రాములు హత్య

Konapuri Ramulu

కొనాపురి రాములు స్వస్థలం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామ పంచాయతీ పరిధిలోని దాసిరెడ్డిగూడెం.  లక్ష్మమ్మ,చంద్రయ్య తల్లిదండ్రులు. మావోయిస్టు ఉధ్యమంలో సాంబశివునిగా సుపరిచితుడైన అయిలయ్య కొనాపురి రాములు కి అన్న. సాంబశివుడు 1991లోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. సాంబశివుడు నక్సలైట్లతో ఉన్నకారణంగా పోలీసులు ఆయన కుంటుంబ సభ్యులను వేధించడంతో సాంబశివుని సోదరుడు రాములు కూడా 1997లో నక్సలైట్ ఉధ్యమంలో కలిసాడు.
 కనగల్ కమాండర్‌గా 2000-2001లో,
 కష్ణపట్టె కమాండర్‌గా 2001-2002లో ,
 స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ కమాండర్‌గా 2002-2003లో పని చేశారు.
2003 ఆగస్టు 13న లొంగిపోయారు.

అన్న సాంబశివుడు 1 జనవరి  2008 న టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ సమయానికి సాంబశివునికి విపరీత ప్రజాభిమానం ఉండేది. రాజకీయాల్లోకి సాంబశివుని రాక ఒక సంచలనమైంది. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న రాములు భువనగిరి నియోజకవర్గం లక్ష్యంగా పని చేశారు. సాంబశివుడి హత్య తర్వాత కొనపురి రాములును హతమార్చేందుకు వరుస దాడులు చేశారు. 2013, 2014 సంవత్సరాల్లో రాములుని చంపడానికి దుండగులు చేసిన రెండు హత్యాప్రయత్నాలు విఫలమయ్యాయి. 11-5-2014 ఆదివారం మూడోసారి నల్లగొండ శివార్లలోని ఫంక్షన్ హాల్ సమీపంలో దారుణంగా హతమార్చారు.

TRS Leader, Ex Naxalite Konapuri Ramulu was Shot Dead in Nalgonda on 11-5-2014 .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *