జ్యోతిష్యం అసలు అది శాస్త్రమేనా?

జ్యోతిష్యం – మానవ జీవితాలపై నక్షత్రాలు గ్రహాల చలనం ప్రభావాన్ని అధ్యయనం చేయడమే జ్యోతిష్య శాస్త్రం.
గ్రహగతులకు సూర్య చంద్ర గమనానికి మానవ ప్రవర్తనకు గల సంబంధం

Important Points
*జ్యోతిష్యం అసలు అది శాస్త్రమేనా?
*అమావాస్య పౌర్ణమి రోజుల్లో విపరీత ప్రవర్తన
*గర్భందాల్చడం, పై చంద్రాయనం ప్రభావం
* ఆడ మగ శిశువుల పుట్టుకను చంద్రాయనం నిర్ణయిస్తుందా?
*జ్యోతిష్య శాస్త్రం – మానవ సంకల్పం

 
జ్యోతిష్యం అసలు అది శాస్త్రమేనా?

జ్యోతిష్యం మూఢనమ్మకంగా కొందరు భావించినా జ్యోతిష్యం శాస్త్రం అనడానికి చాలా ఆదారాలు ఉన్నాయి.
బిగ్ బ్యాంగ్ సూత్రం ఆధారంగా గ్రహాలు మొదలైనవి ఏర్పడ్డాయని భావించినప్పుడు పరోక్షంగా జీవుల ఆవిర్బావం కూడా దాని ఫలితమే. మన మెదడులోని ద్రవాలలో నవ గ్రహాలకు సంబంధించిన ఖనిజాలు ఉంటాయి. గ్రహాలు పరస్పర ప్రభావం కలిగివుంటాయి. అదేవిధంగా మనిషిపై కూడా ఆ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. మానవ మస్తిష్కం గ్రహ గతులకు స్పందిస్తుంది.
సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. చంద్రగమనం కూడా మనపై ప్రభావం చూపిస్తుంది. సముద్రపు అలలు, స్త్రీల ఋతుచక్రం, మానవుల మస్తిష్కం చంద్రగమన ప్రభావానికి లోనౌతాయి. సీజనల్ మెంటల్ డిజార్డర్ గా పిలువబడే (Seasonal Affective Disorder (SAD)) అనే మానసిక రోగం కూడా చలికాలంలో సూర్యుడు చాలాఎక్కువ సేపు కనపడకపోవడం వల్ల సంభవిస్తుంది. భూమధ్యరేఖ ప్రాంతాల్లో ఈ SAD ప్రభావం మనకు కనపడదు.

అమావాస్య పౌర్ణమి రోజుల్లో విపరీత ప్రవర్తన


అసలు జాతకాలను నమ్మవచ్చా. జ్యోతిష్యం అసలు శాస్త్రమేనా అనే సందేహాలు కొందరికి అప్పుడప్పుడూ కలుగుతుంటాయి. అత్యంత సులభమైన ఉదాహరణ నేనొక్కటి ప్రస్తావిస్తా. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అదేవిధంగా మానవుల దేహంలోని నీరు కూడా ఆ ప్రభావానికి లోనవుతుంది. మానవులలో ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి రుజువు కొందరు అమావాస్య పౌర్ణమి రోజుల్లో విపరీత ప్రవర్తనను చూపడం. ముఖ్యంగా మానసిక రోగులకు ఆరోజుల్లో పిచ్చి ఇంకా ఎక్కువ అవడం. ఒక్క చంద్రుడే కాదు ఇతర గ్రహాలు కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తాయి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ క్లైమెటాలజీ The American Institute of Medical Climatology వారు Philadelphia పోలీస్ డిపార్టామెంట్ వారికి సాయపడటానికి ఒక రీసెర్చ్ ని నిర్వహించారు. మానవ ప్రవర్తనపై పౌర్ణమి ప్రభావం మీద జరిపిన ఆ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూసాయి. ఆ పరిశోధన ప్రకారం పౌర్ణమి రోజుల్లో హత్య, విచక్షణా రహితంగా వాహనాల్ని నడిపి ఇతరుల మరణానికి కారణమవడం, అవసరానికి కాకుండా హాబీ పరంగా, మరోరకంగా తప్పకుండా దొంగతనం చేసి తీరాలనే తపన, ఇతరులమీద పగతీర్చుకోవాలనే కోరిక మొదలైనవి ఎక్కువగా రికార్డయ్యాయి. ఆ రకమైన నేరాలు ఆ రోజుల్లో ఎక్కువగా జరిగాయి. Miami విశ్వవిధ్యాలయానికి చెందిన Arnold Lieber అనే మానసిక శాస్త్రవేత్త మియామీలో గత 15 సంవత్సరాలలో జరిగిన 1,887 హత్యలకు పౌర్ణమి, అమావాస్యలకు గల సంబంధాన్ని గూర్చి పరిశోధనలు చేసి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మానవహనన ధుర్ఘటనలు ఎక్కువగా జరిగి మిగతా రోజుల్లో అవి తక్కువగా ఉన్నాయని గుర్తించారు.

          గర్భందాల్చడం, మగ ఆడ పిల్లల జననం పై చంద్రాయనం ప్రభావం
Impact of Lunar Cycle on menstrual Cycle and pregnency

నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్నకాలంలో (పరిమానం తగ్గుతూ కనిపించే సమయంలో) కన్నా చంద్రుని పరిమానం పెరుగుతూ కనిపించే కాలంలో  10 శాతం అధికంగా స్త్రీలు గర్భం ధరించడం జరిగింది. 

ఆడ మగ శిశువుల పుట్టుకను చంద్రాయనం నిర్ణయిస్తుందా?
Lunar Cycle decides birth of Male and Female Children

నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్నకాలంలో (పరిమానం తగ్గుతూ కనిపించే సమయంలో) కన్నా చంద్రుని పరిమానం పెరుగుతూ కనిపించే కాలంలో గర్బం దాల్చినప్పుడు మగ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా పరిశోధనలు తేల్చాయి.-W. Buehler జర్మన్ శాస్త్రవేత్త.

జ్యోతిష్య శాస్త్రం – మానవ సంకల్పం
Human Will and Destiny

జాతకం ప్రకారం మనకు కష్టాలు ఉన్నా అందులో చాలా వరకు మనం దోష నివారణ ద్వారా తొలగించుకోవచ్చు.
ఉదాహరణకు ప్రాచీన గణిత శాస్త్రవేత్త భాస్కరుడు తన కూతురు లీలావతి జాతకం ప్రకారం ఆమె భర్త మరణిస్తాడని తెలుసుకుని ఏ ముహూర్తానికి ఆమె వివాహం జరిగితే ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందో తెలుసుకుని ఆ ముహూర్తానికి కాకుండా వేరే ముహూర్తానికి వివాహం జరిపించాలని ఒక గడియారాన్ని తయారుచేస్తాడు. కుండలో నీరు పోసి అడుగున చిన్న రంధ్రం ద్వారా నీరు ఒక్కొక్క చుక్క కింద పడేలా ప్లాన్ చేస్తాడు. దాని ఆధారంగా కాలాన్ని తెలుసుకుంటాడు. కానీ చివరికి కుమార్తె వివాహం జరిగి ఆమెకు జాతకం ప్రకారం వైధవ్యం ప్రాప్తింస్తుంది. జాతక దోషాన్ని నివారించలేకపోయానని చింతిస్తూ తాను గడియారంగా మలచిన కుండ ను పరిశీలిస్తాడు. ఆ కుండ అడుగున చిన్న ముక్కు పుడక కనపడుతుంది. జరిగిన వాస్తవం ఏమిటంటే భాస్కరుని కుమార్తె లీలావతి ఆడుకుంటూ కుండలోకి తొంగిచూసినప్పుడు ఆమె ముక్కుపుడక జారి కుండలో పడి గడియారం గతి తప్పుతుంది. అందువల్ల భాస్కరుడు తాను అనుకున్న ముహూర్తానికి కాకుండా జాతకం ప్రకారం దోషం ఉన్న ముహూర్తానికే తన కూతురు వివాహం జరిపించి తరువాత బాధపడతాడు. ఇది జ్యోతిష్య శాస్త్రం గురించి ఒక వృత్తాంతం. కానీ మనకు తెలిసిన మరో వృత్తాంతంలో జాతకాన్ని మార్చగలిగిన పరిస్ధితి కనిపిస్తుంది.

సతీ సావిత్రి వృత్తాంతంలో ఆమె భర్త మరణించగా భర్త ప్రాణాలను తీసుకువెళ్తున్న యముని వెంటపడి ఆమె తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంటుంది. మానవ సంకల్పం జాతకాన్ని మార్చగలదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. మీ జాతకం సరిగ్గా లేదని మీరు భావిస్తే రెట్టింపు కష్టపడండి. మీ సంకల్పం మీ జాతకాన్ని మార్చగలుగుతుంది.

జగ్గీ వాసుదేవ్ ఆనే ఆధునిక ఆద్యాత్మిక గురువు ప్రాణం లేని రాయి రత్నం మన జాతకాన్ని మార్చగలదు అనుకుంటే ప్రాణం ఉన్న మనమే ఆ రాయి రత్నం కన్నా భలమైనవారం అని అంటాడు. ఇది మానవ సంకల్ప భలాన్నితెలిపే మరో ఉదాహరణ. జాతకం మీద నమ్మకం తో కానీ, లేదా మన అనుమాన నివృత్తి జరిగి ఆత్మవిశ్వాసం వస్తుందనుకున్న సందర్బంలో దోష నివారణకు పూనుకోవడం మంచిది.

హిందు జ్యోతిష్య శాస్త్రం మనం పుట్టిన కాలంలో నక్షత్రం, లగ్నం, కరణం మొదలైన వాటి ఆధారాంగా మన రాశిని నిర్ణయిస్తుంది. ఇదే మరోవిధంగా చంద్రమానం జ్యోతిష్యం.

 పాశ్చాత్యులు సూర్య మాన జ్యోతిష్యాన్ని అనుసరిస్తారు. అందువల్లే సన్ సైన్ ఆదారంగా మన రాశి వేరుగా ఉంటుంది. మనం పుట్టిన సమయం ఆదారంగా సన్ సైన్ నిర్ణయింపబడుతుంది. దీనికి మనం ఏ ప్రాంతంలో పుట్టాం, ఒక రోజులో ఏ సమయంలో పుట్టాం, లగ్నం, నక్షత్రం మొదలైనవాటితో  సంబంధం ఉండదు. అందువల్ల ఇంగ్లీష్ వారి చార్ట్ ప్రకారం రాశిని తెలుసుకుని పత్రికల్లో ప్రచురితమయ్యే  తెలుగు వారఫలాల్ని చూసుకుంటే ఫలితాలు సరిపోవు. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ఆదారంగా రాశిని తెలుసుకుంటేనే ఫలితాలు సరిపోలుతాయి.

Indian and Western Astrology
Is Astrology a science? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *