కోడలు పిల్ల లాజిక్

ఇది మామూలు లాజిక్ కాదు బాబోయ్ 😂🤣

కొత్తగా పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్ళిన కోడలి తో అత్త, గుడికి వెళ్ళి సంప్రదాయం ప్రకారం దేవి దర్శనం చేసుకొని మన కోరికలు కోరి వద్దాం అంది, దానికి కోడలు సరే నని తయారయ్యి, ఇద్దరు కలిసి గుడి కి వెళ్లారు, గుడి ముందు రెండు సింహాలు ఉంటే కోడలు అత్త తో ” *ఇక్కడ నుండి వెనక్కి వెళ్దాం లేదంటే ఆ రెండు సింహాలు మనల్ని చంపి తినేస్తాయి”* అని భయపడుతూ చెప్పింది, దానికి అత్త ఎం పిచ్చి పిల్లవే *”అవి రెండు గుడి ముందు పెట్టిన బొమ్మ సింహాలు అవి మనల్ని ఏమీ చేయలేవు”* అని చెప్పి ముందుకు తీసుకెళ్ళింది, గుడి దగ్గరకు రాగానే ఒక ఆవు తన దూడకు పాలిస్తోంది, దానిని చూసి కోడలు *”అత్తయ్య పాలు అన్ని దూడ తగేస్తోంది ఇక్కడ ఎవరూ అడిగే వారు లేరు, మనం ఇంట్లో నుండి ఒక గిన్నె తెస్తే పాలు తీసు కెళ్ళ వచ్చు”* అంది, దానికి అత్త కొద్దిగా కొడలిపై కొప్పడుతూ, *”అది రాయి తో చేసిన ఆవు దూడ బొమ్మలు అవి ఎలా పాలిస్తాయి”,* అని విసుక్కుంటూ నే, కోడలి తో కలిసి గుడిలోకి వెళ్ళాక, కోడలి పిల్ల తో *”ఇప్పుడు శ్రద్ధగా దేవి ని మొక్కుకొని కోరికలు కోరుకో”* అని చెప్పింది, దానికి కోడలు పిల్ల *”అత్తయ్యా రాతి తో చేసిన సింహాలు మన ప్రాణం తీయ లేనప్పుడు, రాతి తో చేసిన ఆవు పాలు ఇవ్వ లేనప్పుడు, రాతి తో చేసిన బొమ్మ మన కోరికలు తీరుస్తదా”* అని అడిగింది. Logic అర్థమైందా.😁

Updated: April 20, 2020 — 2:07 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *