Tips to get rid of stress

Tips to get rid of stress
నేటి పోటీ ప్రపంచంలో ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి

గురవుతున్నారు. విద్యార్థులు చదువులో రాణించాలని, ఉద్యోగులు వృత్తిలో నైపుణ్యం

సంపాదించాలని, ఇక ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ లేక అందరి అవసరాలు తీర్చే

బాధ్యతతో గృహిణులు… ఇలా ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడిని గురవుతున్నారు. ఇలా తీవ్ర

ఒత్తిడికి గురయి కొందరు విజయం సాధిస్తుంటే, మరి కొందరు అపజయంతో నిరాశ

నిస్పృహలకు లోనయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు విజయం

సాధించినా ఒత్తిడి వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహం,

రక్తపోటు, మానసిక సమస్యల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నవి. ముఖ్యంగా మానసిక

సమస్యలు తీవ్రమైన సమస్యగా రూపుదిద్దుకుంటుంది. వీటి వలన సాధించిన

విజయాలు ఆస్వాదించలేకపోతున్నారు.

ప్రస్తుతం మనదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు మానసిక సమస్యలతో

బాధపడుతున్నారు. రెండు శాతం మంది తీవ్రమైన మానసిక సమస్యలతో

బాధపడుతుంటే, ఐదు శాతం మంది సాధారణ మానసిక సమస్యలతో

బాధపడుతున్నారు. 2020 నాటికి ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న అతి ముఖ్యమైన ఆరోగ్య

సమస్యలలో డిప్రెషన్‌ రెండవస్థానం ఆక్రమిస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాలు

చెబుతున్నాయి.

ఇంత తీవ్రమైన మానసిక సమస్యలను నియంత్రించడానికి వ్యక్తిపరంగా, ప్రభుత్వ

పరంగా, సమాజపరంగా ఎటువంటి ప్రయత్నం జరగటం లేదని చెప్పవచ్చు. మానసిక

సమస్యలతో బాధపడుతున్న వారిలో 75శాతం నుండి 83శాతం మంది అసలు

వైద్యుని సంప్రదించడం లేదు. మన ప్రభుత్వాలు బడ్జెట్‌లో వైద్యానికి ఖర్చుపెడుతున్న

దాంట్లో ఒక శాతం కంటే తక్కువ శాతం మానసిక ఆరోగ్యం కోసం ఖర్చుచేస్తోంది.

మానసిక సమస్యల పట్ల అవగాహన లేకపోవటం వలన ఇలా జరుగుతుంది.

ఇంతగా ఆలోచింపచేస్తున్న మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ

‘అందరికీ ఆరోగ్యం’ అన్న నినాదంలో ఆరోగ్యం అంటే కేవలం శారీరకంగా వ్యాధి లేక

పోవటం కాదు. శారీరక, మానసిక ఆరోగ్యం ముఖ్యం అని నిర్వచించింది. అసలు

మానసిక ఆరోగ్యం అంటే ”ఒక వ్యక్తి తన శక్తిసామర్ధ్యాలను గుర్తించి వాటిని తన

అభివృద్ధికి, దేశాభివృద్ధికి సంపూర్ణంగా ఉపయోగించి సమాజంలో అందరితో కలిసి

మెలిసి జీవించడం”.

ఒక వ్యక్తి తన శక్తిసామర్ధ్యాలను ఎక్కువగా అంచనా వేసుకుని కష్టతరమైన లక్ష్యాలు

నిర్ధేశించుకుని వాటిని సాధించలేనప్పుడు లేదా తక్కువగా అంచనా వేసుకుని ఏ

లక్ష్యాలు నెరవేర్చుకోనప్పుడు లేదా తన శక్తిసామర్ధ్యాలను అసాంఘిక

కార్యకలాపాలకు దుర్వినియోగం చేసి నేరాలకు పాల్పడటం ఇవన్నీ మానసిక సమస్యల

పరిగణలోకి వస్తాయి. అలాగే సమాజంలో ఇతరులతో కలిసిమెలిసి జీవించలేక తన

వల్ల ఇతరులను ఇబ్బందికి గురిచేయటం లేదా తను ఇబ్బందిపడటం వలన కూడా

మానసిక సమస్యలు తలెత్తుతాయి. దీనికి దారితీసిన పరిస్ధితులను సమగ్రంగా

విశ్లేషించి అవగాహన కల్పిస్తే మానసిక సమస్యలకు చికిత్స వీలవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *