Health benefits of Ajeera Figs Athipandu Ajura

Health benefits of Ajeera Figs Athipandu Ajuraఅంజీర పండు..

ఇది కొంతమందికి తెలుసు..మరి కొంతమందికి తెలువదు. తెలిసినా ఏ ఏముంది

అంటూ కొనకుండా ఉంటారు. కాని ఈ పండులో అద్భుతమైన

పోషకవిలువలున్నాయి. మంచి ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాని ఇస్తాయి.. ఒక్కసారి దీని

గురించి..

పండిన లేదా ఎండిన అంజీరాపళ్ళు ఎర్రగా ముదురు గులాబీ రంగులో లేదా నీలంగా

ఉంటూ మనకి దొరుకుతాయి. లోపల చిన్న చిన్న గింజలతో తీయని గుజ్జుతో

రుచికరంగా ఉంటుంది. అంజీరాలో పిండి పదార్థం కార్బోహైడ్రేట్స్‌ 19 గ్రాములు,

షుగరు 169 గ్రాములు, పీచుపదార్థం 39 గ్రాములు, కొవ్వు 3 గ్రాములు,

మాంసకృత్తులు 0.89 గ్రాములు, విటమిన్‌ బి6 110 మి.గ్రాములు, శక్తి 310

కి.గ్రాములుంటాయి. దీనిలో ఉన్న పోటాషియం రక్తపుపోటును నియంత్రిస్తుంది.

లావును తగ్గించేందుకు సహాయ పడుతుంది. ఈ అంజీరా పండ్లు తింటే రొమ్ము

క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నాయి.

 

సరిగ్గా నిద్రలేని వారు రాత్రి ఏడు గంటల తరువాత మూడు అంజీరపు పళ్ళు తిని,

పాలు తాగితే చక్కగా నిద్ర పడుతుంది.

తరచూ జలుబు చేసిందంటే ఈ అంజీరపు పళ్ళ రసం తాగితే బాగుంటుంది.

ఆడపిల్లలు రోజు రెండు పళ్ళు తింటే మొటిమలు తగ్గి ఆకర్షణీయంగా తయారవుతారు.

కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

స్త్రీ – పురుషులిద్దరూ రెండు అంజీరా పండ్లు, పాలు తీసుకుంటే యవ్వనాన్ని చిరకాలం

ఉంచుకోవచ్చు.

ఎదుగుతున్న పిల్లలు ఈ పండ్లను తినడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *